గ్రీన్,బ్లాక్ టీలతో ఒబేసిటీ, షుగర్ దూరం

16-05-2018: గ్రీన్, బ్లాక్ టీలను ప్రతిరోజూ తాగితే ఒబేసిటీ, మధుమేహం దూరమవుతాయని కోబీ విశ్వవిద్యాలయం పరిశోధకుల బృందం తాజాగా వెల్లడించింది. జపాన్ దేశానికి చెందిన కోబీ యూనివర్శిటీ పరిశోధక బృందం గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగిన రెండు విభాగాల వారిని అధ్యయనం చేసింది. గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగిన వారి కొలెస్ట్రాయిల్ స్థాయి తగ్గడంతోపాటు మధుమేహ వ్యాధిగ్రస్థులకు చక్కెర స్థాయి తగ్గి షుగర్ అదుపులో ఉందని తేలింది. ఇన్సులిన్ తీసుకుంటున్న మధుమేహులు ఈ గ్రీన్, బ్లాక్ టీ తాగితే వారి షుగర్ అదుపులో ఉందని వెల్లడైంది. దీంతోపాటు ఈ టీలను ప్రతీరోజూ తాగితే ఒబేసిటీ సమస్య ఉండదని జపాన్ పరిశోధకులు తేల్చి చెప్పారు.