చక్కెరస్థాయిని తగ్గించే పాలు

12-09-2018: షుగర్‌ పేషెంట్లు పాలు తాగడం అంత మంచిదికాదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ అభిప్రాయం తప్పంటున్నారు టొరంటో పరిశోధకులు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత పాలు తాగినట్టయితే రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి తగ్గుతుందన్న విషయం వీరు నిర్వహించిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) సమయంలో అధిక ప్రోటీన్లు కలిగిన పాలు.. బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. తృణధాన్యాలను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకున్న తర్వాత నీటికి బదులు పాలు తాగినట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిన విషయాన్ని వీరు గమనించారు. ఒక్క బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత కాకుండా మధ్యాహ్నం, రాత్రి భోజనం తరువాత పాలు తాగినా మంచిదే అని పరిశోధకులు చెబుతున్నారు.