మూలకణాలతో కిడ్నీ తయారీ

11-02-2018: వైద్య చరిత్రలోనే తొలిసారిగా మానవుడి మూత్రపిండాల కణజాలాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కిడ్నీ వ్యాధులకు మెరుగైన వైద్యం అందించేందుకు మూలకణాల సహాయంతో యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేశారు. కిడ్నీ కణజాలంతో రూపొందించిన చిన్న కిడ్నీని ఎలుకల్లో పరీక్షించగా.. అది శరీరంలోని వ్యర్థాలను వడపోయడమే కాకుండా విసర్జితాలను బయటకు పంపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు.