రోజుకో పెగ్గు.. ఆయుష్షు తగ్గు

15-04-2018: రోజుకో పెగ్గు చొప్పున తరచూ ఆల్కహాల్‌ సేవిస్తే తొందరగా మరణిస్తారని అంటున్నారు యూకేలోని కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధకులు. ప్రతిరోజు బీరు లేదా వైన్‌ తాగడం వల్ల తీవ్ర గుండెపోటు, గుండె వైఫల్యం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ఇవి మరణానికి కూడా దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. వారానికి 10-15 గ్లాసుల ఆల్కహాల్‌ తాగితే ఆయుర్దాయంలో రెండేళ్లు తగ్గిపోతుందట.