వారాంతాల్లో ఆలస్యంగా నిద్రిస్తే...

1-7-2017:వారాంతాల్లో ఆలస్యంగా నిద్రించడం, ఆపై ఆలస్యంగా లేవడం హృద్రోగాలకు దారితీస్తుందని యూనివర్సిటీ ఆఫ్‌ అరిజోనా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల హృద్రోగ ముప్పు 11 శాతం పెరుగుతోందట! రోజూ నిర్ణీత సమయానికి, నిర్ణీత కాలంపాటు నిద్రించడం ద్వారా గుండె జబ్బులు సహా వివిధ అనారోగ్యాలను దూరం పెట్టవచ్చని సూచిస్తున్నారు. కాగా, రోజువారీ నిద్రకు అదనంగా ఓ గంట తోడైతే అథ్లెట్ల సామర్థ్యం పెరుగుతుందని మరో అధ్యయనంలో వెల్లడైంది. సదరు ఈవెంట్‌కు ముందు వారం రోజులు ఈ పద్ధతి పాటిస్తే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.