చక్కని డైట్‌తో మహిళల్లో వినికిడి లోపం దూరం

15-05-2018: ఆరోగ్యకర డైట్‌ పాటించడం వల్ల మహిళల్లో వినికిడి లోపం వచ్చే ముప్పు తగ్గుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. భిన్న రకాల ఆహారపు అలవాట్లు.. వాటి ద్వారా వినికిడి సమస్యలు వచ్చే అవకాశాలపై పరిశోధన జరిపిన అమెరికాలోని బ్రిఘం అండ్‌ ఉమెన్స్‌ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.