పొట్ట చుట్టూ కొవ్వుతో ఆందోళన

08-03-2018: అధిక బరువుగల మహిళలు ఎక్కువగా ఆందోళన చెందే అవకాశాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా మధ్య వయసున్న మహిళలపై ఇది ఎక్కువ ప్రభావం చూపువచ్చని పేర్కొన్నారు. మహిళ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు.. ఆ మహిళ నడుము పెరగడానికి కారణమవుతుందని, ఇది వారు ఆందోళన చెందడానికి దారితీయవచ్చన్నారు. లాటిన్‌ అమెరికాలోని 5,580 మంది మధ్య వయసున్న, మెనోపాజ్‌ దశ దాటిన మహిళలపై అధ్యయనం చేశారు. వీరిలో 61.3 శాతం మంది మహిళలు ఆందోళన చెందుతున్నట్లు కనుగొన్నారు. మధ్యవయసులో ఈస్ర్టోజన్‌ తగ్గుదల కూడా మహిళల ఆందోళనకు కారణం కావచ్చని చెప్పారు.