ఏసిలతో కళ్ళకి ప్రమాదం!

09-05-2019: ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరి చూపు ఏసీలపైనే ఉంటుంది. కానీ ఏసీ వల్ల ఆరోగ్యానికి జరిగే హాని ఎక్కువంటున్నారు నిపుణులు. ఏసి చల్లదనం శరీరానికి హాయిగా అనిపించినా కళ్లకు మాత్రం శాపమట! ఏసీలో ఎక్కువ గంటలు గడిపేవారు.. ‘డ్రై ఐ సిండ్రోమ్’ బారిన పడుతున్నట్లు ఇటీవల చేసిన ఓ సర్వేలో తేలింది. వారంతా వేసవిలోనే ఈ జబ్బుకి గురవ్వడం గమనార్హం. చాలామంది రోజుకి 16నుంచి 18గంటలపాటు ఏసీలో గడుపుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.. ఇన్ని  గంటలపాటు ఏసిలో గడిపేవారికే  డ్రై ఐ సిండ్రోమ్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. కళ్లు పొడిబారడం, కళ్లలో మంట, దురద, కంటి నుంచి నీరు కారడం, ఎర్రబడడం, చూపు మసకబారడం వంటి లక్షణాలతో డ్రై ఐ సిండ్రోమ్‌ వస్తుంది. పై లక్షణాలు కనిపించిన వెంటనే ఏసిని ఆపి వేయడమో లేక మరోగదిలోకి మారడమో చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.