విడతలవారీ వ్యాయామం ఆరోగ్యానికి భేష్‌!

వాషింగ్టన్‌, జనవరి 8: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే గంటలకొద్దీ వ్యాయామాలు చేయాలని అందరూ భావిస్తుంటారు. అయితే ఏకబిగిన గంటల తరబడి ఎక్సర్‌సైజ్‌ చేయడం కంటే.. కొన్ని నిమిషాలపాటు విడతల వారీగా చేసే వ్యాయామంతోనే ఆరోగ్యానికి మేలని అమెరికాలోని ఆరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిపై పదేళ్లుగా పరిశోధనలు చేసిన వారు.. కనీసం 30 సెకన్ల నుంచి కొన్ని నిమిషాలు సాగే వ్యాయామాలు విడతల వారీగా చేయాలని సూచిస్తున్నారు.