రోగ నిరోధక వ్యవస్థ లోపాలతో కుంగుబాటు

12-09-2017: రోగ నిరోధక వ్యవస్థలో ఏర్పడే లోపాలతో కుంగుబాటుకు గురవుతామని శాస్త్రవేత్తలు తెలిపారు. నిరోధక వ్యవస్థ అతిగా ఉత్తేజితం కావటం లాంటి లోపాల వల్ల వ్యాకులత ఏర్పడుతుందని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం మెదడులోని సెరోటోనిన్‌తో పాటు మానసిక స్థితిని పెంచే రసాయనాలను పునరుద్ధరించి కుంగుబాటును దూరం చేస్తున్నారని, త్వరలో శోధనిరోధక ఔషధాలపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు.