మధుమేహాన్ని ముందే గుర్తించొచ్చు!

11-06-2019: టైప్‌-2 మధుమేహాన్ని గు ర్తించడంలో కొవ్వుకణాల నుంచి విడుదలై రక్తనాళాల నుంచి ప్రవహించే ఎక్సోజోములు, చిన్ని నానోపార్టిక ల్స్‌ సహాయపడతాయని శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో వెల్లడించారు. శరీరంలోని ఆరోగ్యకర కొవ్వు క ణాలు అనారోగ్యం పాలైనప్పుడు విపరీతంగా బరువు పెరిగి ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకాయం ఉ న్న యువకుల్లో టైప్‌-2 మధుమేహం అభివృద్ధి చెందడానికి కారణాలను గుర్తించేందుకు 12-17 ఏళ్ల వయసున్న 55 మందిపై అధ్యయనం చేశారు. మెటబాలి జం, బాడీ కంపోజిషన్‌, సర్కులేటింగ్‌ ఎక్సోజోమ్స్‌ ప రీక్షలు నిర్వహించారు. టీనేజర్ల రక్తంలో పెరిగిన విసెరల్‌ కొవ్వు నిల్వలు, బ్లడ్‌ షుగర్‌ను ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు ఈ అధ్యయనంలో గుర్తించారు.