పచ్చబొట్టుతో రోగనిరోధక వ్యవస్థకు హాని

13-09-2017: ఇప్పటి ట్రెండ్‌ అంతా పచ్చబొట్టు(టాటూ)దే. ఏ యువతీ యువకుడి చేయి చూసిన టాటూ దర్శనమిస్తుంది. అయితే, పచ్చబొట్టు శరీరానికి చాలా ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. శాశ్వతంగా ఉంటే టాటూలు రోగనిరోధక వ్యవస్థకు అతిముఖ్యమైన శోషరస గ్రంధుల(లింఫ్‌ నోడ్స్‌) వ్యాకోచాన్ని అడ్డుకుంటాయని, దాంతో రోగాన్ని తట్టుకునే శక్తి కోల్పోతారని జర్మనీకి చెందిన యురోపియన్‌ సింక్రట్రాన్‌ రేడియేషన్‌ ఫెసిలిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. టాటూ సిరాలో ఉండే విషపూరిత మలినాలు శరీరంలోకి చొచ్చుకొని పోయి ఆ గ్రంధులపై చెడు ప్రభావం చూపినట్లు తమ పరిశోధనల్లో తేలిందని తెలిపారు.