షుగర్‌ రోగుల మరణాలకు చెక్‌!

06-07-2019: మనోవ్యాకులతను పొగొట్టే పదార్థాల(యాంటీడిప్రెజంట్స్‌)తో షుగర్‌ రోగుల్లో మరణాల రేటును 35ు తగ్గించవచ్చునని తాజా సర్వే పేర్కొంది. చాంగ్‌గుంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఈ సర్వే నిర్వహించారు. షుగర్‌ ఉన్న వారు చాలా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఆ దిగులుతోనే మరణానికి చేరువ అవుతారు. అందుకే వారికి మనో వ్యాకులతను పోగొట్టే పదార్థాలు చాలా మేలు చేస్తాయని వివరిస్తున్నారు. ఈ వివరాలను క్లినికల్‌ ఎండోక్రినాలజీ అండ్‌ మెటబాలిజమ్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.