వ్యాయామంతో మెదడు చురుకు

11-07-2019: వ్యాయామం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, శరీర బరువు తగ్గుతుందని మనకు తెలిసిందే. అయితే మరో ఉపయోగం కూడా ఉందంటోంది తాజా సర్వే. అధిక బరువు కలిగిన వారు వ్యాయామం చేయడంవల్ల వారి మెదడు పనితీరు మెరుగుపడుతుందని చెబుతోంది. జీవక్రియ, ఆలోచనలు, ఆరోగ్యం అన్నీ చురుకుగా ఉంటాయని పేర్కొంటోంది. ఎప్పుడూ కదలకుండా ఉండే 22 మంది ఊబకాయులపై అధ్యయనకారులు పరీక్షలు చేశారు. 8 వారాల వ్యాయామం తర్వాత వారి మెదడు పనితీరును గమనించారు.