సోషల్‌ మీడియాలోనే హ్యాపీ

ఆంధ్రజ్యోతి, 21-12-2016: సోషల్‌ మీడియాతో ఎక్కువగా టచ్‌లో ఉండే పిల్లలు, టీనేజర్స్‌ నిజజీవితంలో హ్యాపీగా ఉండలేక పోతున్నారని తాజాగా ఓ సర్వే చెబుతోంది. సోషల్‌ మీడియాలో చాటింగ్‌, లైక్స్‌, వీడియో లైవ్స్‌ లాంటి ఫీచర్స్‌కు అలవాటు పడిన పిల్లలు, టీనేజర్స్‌ నిజజీవితంలో స్నేహితులకు పెద్దగా ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదట. బ్రిటన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లేబర్‌ ఎకనిమిక్స్‌ ఈ సర్వే చేసింది. 2010 నుంచి ఇప్పటివరకూ ఈ సర్వేలో పదేళ్ల పిల్లల నుంచి 15 ఏళ్ల వయసు మధ్య ఉండే వారిని ఈ సర్వేలో తీసుకున్నారు. కనీసం గంటపాటు సోషల్‌ మీడియాలోని స్నేహితులతో మాట్లాడే పిల్లలు, టీనేజర్స్‌ వారి చుట్టుపక్కల ఉండే వారితో క్లోజ్‌గా మూవ్‌ కాలేకపోతున్నారని ఇందులో తేలింది. వారు సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీలవుతున్నారట.