భారత్‌ పోలియో రహితమే డబ్ల్యూహెచ్‌వో

న్యూఢిల్లీ, అక్టోబరు 11: భారత్‌ పోలియో రహిత దేశమని యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పునరుద్ఘాటించాయి. దేశంలో టీకాలు వేసే కార్యక్రమం నిరంతరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ మందు తీసుకున్న పిల్లలకు పోలియో వైరస్‌ సోకే ప్రమాదం చాలా స్వల్పమని స్పష్టం చేశాయి. నోటిద్వారా ఇచ్చే టైప్‌-2 పోలియో వ్యాక్సిన్‌ కలుషితం కావడంతో లక్షలాది మంది పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడిందని కొద్ది రోజుల క్రితం ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ రెండు సంస్థలు గురువారం సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.