మూలకణాలతో బ్లడ్‌ కేన్సర్‌కు చికిత్స

 

బెంగళూరు, ఏప్రిల్‌ 14: బ్లడ్‌ కేన్సర్‌.. ఈ ప్రాణాంతక వ్యాధికి ఇప్పటివరకు చికిత్స లేదు. క్రమం తప్పకుండా రక్తమార్పిడి చేయడం ద్వారా కొంతకాలం ప్రాణాలను నిలబెట్టవచ్చు. అయితే, ఈ వ్యాధికి చికిత్సను అందించడంలో మూలకణాల్లోని ప్రోటీన్‌ ఆస్రిజ్‌ కీలక పాత్ర పోషిస్తుందని బెంగళూరు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(జేఎన్‌సీఏఎ్‌సఆర్‌) పరిశోధకులు ఎలుకలపై ప్రయోగం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. ట్యూమర్‌ సప్రెసర్‌ పీ53ని నియంత్రించడం ద్వారా, బ్లడ్‌ కేన్సర్‌ పెరగకుండా ఈ ఆస్రిజ్‌ ప్రోటీన్‌ దోహదపడినట్లు తమ అధ్యయనంలో తెలిసిందని పరిశోధకులు వెల్లడించారు.