ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలు!

అమలాపురం టౌన్‌, ఆగస్టు 19: తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన పత్సమట్ల సాయిలక్ష్మి ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఇది ఆమెకు తొలికాన్పు. పుట్టినిల్లు అయిన కొమరగిరిపట్నం నుంచి పురుడు పోసుకునేందుకు అమలాపురంలోని రోహిణి ఆస్పత్రిలో చేరిన ఆమె ఇద్దరు మగబిడ్డలు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్‌ వెంపరాల శారద తెలిపారు.