‘ఊపిరి’ తీస్తున్న రోగం

సాయం కోసం ఓ కుటుంబం వేడుకోలు

చిత్తూరు, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): రెక్కాడితేగానీ పూటగడవని కుటుంబం. అలాంటి వారిపై విధి కన్నెర్ర చేసింది. వివరాల్లోకివెళితే.. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పేయ నపల్లె శివారు పౌల్‌పురంలో ఉంటోన్న థామస్‌ ఒకప్పుడు బెంగళూరులో స్కూలు బస్సు డ్రైవర్‌. భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకసారి ఆయాసంగా అనిపించడంతో ఆస్పత్రిలో పరీక్షించగా.. ఊపిరితిత్తులు పాడయ్యాయని, గుండె పనితీరు కూడా కొంత దెబ్బతిందని వైద్యులు చెప్పారు. వెంటనే అవయవమార్పిడి ద్వారా ఊపిరితిత్తులు మార్చకపోతే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని హెచ్చరించారు. శస్త్రచికిత్సకు రూ.40 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.
 
దీంతో థామస్‌ కుటుంబం దిక్కుతోచని స్థితిలోపడింది. స్నేహితులు, బంధువులు నెలకు రూ.5 వేలు సాయం చేస్తుండటంతో ఆ మొత్తంతో ఆక్సిజన్‌ పెట్టుకుని థామస్‌ ప్రాణాలు నిలబెట్టు కుంటున్నారు. శస్త్రచికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం, దాతలు సాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు చొరవతీసుకుని సీఎం సహాయ నిధినుంచి తోడ్పాటందించాలని కోరుతున్నారు. సాయం చేయదల్చుకున్నవారు.. ఏసయ్య (థామస్‌ మేనమామ) ఫోన్‌ 94411 52209ను సంప్రదిందొచ్చు. బ్యాంకు వివరాలు.. సి. థామస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అకౌంట్‌ నెంబరు 849610110006961, జేబీ నగర్‌శాఖ, బెంగళూరు, ఐఎఫ్ ఎస్ సి కోడ్‌: బీకేఐడీ0008496.