ప్రొస్టేట్‌ కేన్సర్‌ను తగ్గించే టెస్టోస్టిరాన్‌!

వాషింగ్టన్‌, మార్చి 17: ప్రొస్టేట్‌ కేన్సర్‌ పునరావృతమయ్యే అవకాశాలను టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ తగ్గిస్తుందని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రొస్టేట్‌ కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న 854 మందిపై వారు అధ్యయనం చేశారు. వారిలో 152 మందికి టెస్టోస్టిరాన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ అందించారు. శస్త్రచికిత్స అనంతరం 3 ఏళ్లకు వారిలో కేన్సర్‌ పునరావృతమయ్యే అవకాశాలను గుర్తించేందుకు వారిని పరీక్షించారు. అయితే టెస్టోస్టిరాన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ తీసుకోని వారిలో ప్రొస్టేట్‌ కేన్సర్‌ పునరావృతమయ్యే అవకాశం 15 శాతం ఉన్నట్టు వారు గుర్తించారు. టెస్టోస్టిరాన్‌ రీప్లే్‌సమెంగ్‌ థెరపీ తీసుకున్న వారిలో ఈ అవకాశం 5 శాతంగానే ఉన్నట్టు పేర్కొన్నారు.