నేడు పల్స్‌ పోలియో

55 లక్షల మంది చిన్నారుల కోసం ఏర్పాట్లు

అమరావతి: పల్స్‌ పోలియో కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగే కార్యక్రమంలో 51.66 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. అందుకోసం 37,493 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఇవి కాక మరో 1354 సంచార కేంద్రాలను కూడా ఏర్పాటుచేశారు. ఆశా వర్కర్లు, ఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1,49,977 మంది సిబ్బంది పల్స్‌ పోలియో కార్యక్రమాల్లో పాల్గొంటారు. అప్పుడే పుట్టిన వారి నుంచి ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకోవచ్చని అధికారులు సూచించారు.