బెడ్‌లు ఉన్నా.. నేలపైనే రోగులు

మెదక్‌, 18-08-2019: ఇది మెదక్‌లోని ఏరియా ఆస్పత్రి. నేలపైన పడుకున్న మహిళలంతా రోగులు. శనివారం ఈ ఆస్పత్రిలో 65మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించారు. యాభై వరకు బెడ్‌లు ఖాళీగా ఉన్నా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నవారికి ఇవ్వకపోగా అందరినీ నేలపైనే పడుకోబెట్టారు. బెడ్లు ఖాళీగా ఉన్నా రోగులకు ఎందుకు ఇవ్వలేదని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. అందరికీ సరిపోయే విధంగా బెడ్లు లేవని, అందుకే ఇవ్వలేదని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు.