3 లక్షల మందికి ఎన్టీఆర్‌ వైద్య‘సేవ’

అమరావతి, 11-10-2018: ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ ద్వారా ఈ ఏడాది ఇప్పటి వరకు 3 లక్షల మంది రోగులకు శస్త్ర చికిత్సలు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. వీటికోసం రూ.1,317.34 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. ప్రతి జిల్లాకు వంద కోట్ల చొప్పున వ్యయమైనట్టు తెలిపింది. ట్రస్ట్‌ ద్వారా కేవలం పేదవారికే కాకుండా అనాథలకు, వీధిబాలలకు, వృద్ధాశ్రమాల్లోని వారికి అండగా నిలుస్తున్నట్టు వివరించింది.