గుండె మార్పిడి శస్త్రచికిత్సలకు ‘మణిపాల్‌’కు అనుమతి

తాడేపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 17: గుంటూరు జిల్లా తాడేపల్లి కనకదుర్గవారిధి సమీపంలోని మణిపాల్‌ వైద్యశాలలో గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు(ట్రాన్స్‌ప్లాంట్‌) అనుమతి వచ్చినట్టు వైద్యశాల సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ నల్లమోతు మురళీకృష్ణ తెలిపారు. బుధవారం వైద్యశాలలో విలేకరుల సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. గుండె పూర్తిగా దెబ్బతిని, చివరి దశకు వచ్చిన రోగులకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ విధానం వల్ల కొత్త జీవితం పొందే అవకాశం ఉందని చెప్పారు. అవసరమైన హృద్రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. సీటీవీఎస్‌ కన్సల్టెంట్‌ నిపుణులు డాక్టర్‌ శ్రీనివా్‌సబాబు మాట్లాడుతూ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయడానికి అవయవదాతలు కూడా ముందుకు వస్తున్నారన్నారు. మణిపాల్‌ వైద్యశాల యూనిట్‌ హెడ్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ కోస్తా ప్రాంతంలో గుండె మార్పిడి వంటి వైద్యసేవలు అవసరమైన వారుసుదూర ప్రాంతాలకు వెళుతున్నారని, ఇక వారి అవసరాలను మణిపాల్‌ వైద్యశాల తీరుస్తుందన్నారు.