చిరునవ్వుతో ఆనందమే

 

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 14: నవ్వు ఆరోగ్యానికి మంచిది. ఎంత బాధలో ఉన్నా ఒక చిరునవ్వుతో వాటిని మరిచిపోవచ్చు. అందుకే రోజులో ఒక్కసారైనా నవ్వాలని చెబుతుంటారు. అయితే, అప్పుడప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల మనసుకు సంతోషంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ముఖ కవలికలకు, భావోద్వేగాలకు మధ్య సంబంధంపై 50 ఏళ్లకు సంబంధించి 138 అధ్యయనాలను విశ్లేషించిన అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెన్నసీ పరిశోధకులు ఈ విషయాన్ని తెలిపారు. ఒక్క చిరునవ్వుతో మనసుకు ప్రశాంతంగా ఉంటుందని.. అదే కోపంగా ఉంటే.. మన భావోద్వేగాలు కూడా సీరియ్‌సగా మారిపోతాయని పేర్కొన్నారు.