మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీపి కబురు చెప్పిన రైల్వే

వ్యాధిగ్రస్తులకు ఇకనుంచి రైళ్లలో ప్రత్యేక మెనూ

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి), 12-10-2018: మధుమేహ వ్యాధిగ్రస్తులకు భారతీయ రైల్వే శుభవార్త అందించింది. రైళ్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే రోగులకు ప్రత్యేక భోజన సౌకర్యాన్ని కల్పించేందుకు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) సిద్ధమైంది. ఈ మేరకు ’ఫుడ్‌ ఆన్‌ ట్రాక్‌ యాప్‌’ ద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలను వారికి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. మధుమేహులు తమ శరీరంలో చక్కెర స్థాయులను దృష్టిలో ఉంచుకొని, దానికి తగ్గట్లు ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. అందువల్ల వీరికోసం ప్రత్యేక భోజనాన్ని అందిస్తామని ఐఆర్‌సీటీసీ ట్వీట్‌లో పేర్కొంది.