ఇక గర్భిణులకు ఉచితంగా వైద్యపరీక్షలు, స్కానింగ్

పూణే, 14-07-2018: గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పూణే నగరంలోనూ గర్భిణులకు ఉచితంగా వైద్యపరీక్షలు, స్కానింగ్ చేయాలని ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖాధికారులు నిర్ణయించారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద మహారాష్ట్రలోని గర్భిణులకు ఉచితంగా స్కానింగ్ చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా గర్భిణులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి పిండం ఎదుగుదలను పరిశీలించి వైద్యులు చికిత్స చేస్తున్నారు. పూణే నగరంలో ప్రైవేటు రేడియాలజిస్టులతోనూ ఉచితంగా గర్భిణులకు వైద్యపరీక్షలు జరిపేలా మున్సిపల్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. గర్భం దాల్చిన మహిళలు ఎలాంటి సమస్యలు లేకుండా పిల్లలు జన్మించేలా వైద్యాధికారులు చర్యలు తీసుకోనున్నారు.