డెంగీతో 8 నెలల గర్భిణి మృతి

ఇల్లెందు టౌన్‌, 09-10-2018: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన ఓ మహిళ డెంగీతో మృతి చెందింది. ఆంబజార్‌కు చెందిన ఎస్కే రేష్మ (24) ఎనిమిది నెలల గర్భిణి. గత ఐదు రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతోంది. హైదరాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది.