రేపు ఈఎన్‌టీ ఉచిత వైద్య శిబిరం

హైదరాబాద్‌, 26-04-2019: యూస్‌ఫగూడలోని మారుతినగర్‌ అలహాబాద్‌ బ్యాంక్‌లో శుక్రవారం ఉచిత ఈఎన్‌టీ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు సిరిల్‌ ఈఎన్‌టీ వైద్యశాల డాక్టర్‌ కేవీ.రవికిశోర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుందని, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు, వ్యాధులున్నవారికి ఉచితంగా పరీక్షలతో పాటు చికిత్స అందజేయనున్నట్లు తెలిపారు. వివరాలకు ఫోన్‌ నెం.79954 47999, 80085 95999లను సంప్రదించాలని కోరారు.