3 చుక్కల రక్తంతో 50 రోగాల నిర్ధారణ

‘డ్రై బ్లడ్‌ స్పాట్‌’తో 48 గంటల్లో శిశువు రుగ్మతలు గుర్తింపు

హైదరాబాద్‌ సిటీ(ఆంధ్రజ్యోతి), 12-10-2018: పిల్లలు పుట్టగానే వారికి పుట్టుకతో వచ్చే జబ్బులు ఏమేం ఉన్నాయో పసిగట్టడం కష్టమే. వాటి తీవ్రత పెరిగాకే జబ్బు గురించి తెలు స్తోంది. అప్పటికే శిశువులు చనిపోతున్న సందర్భాలున్నాయి. అయితే, బిడ్డ పుట్టినప్పటి నుంచి కేవలం 48 గంటల నుంచి 72 గంటల్లో 50 రోగాలను గుర్తించే డ్రై బ్లడ్‌ స్పాట్‌ పరీక్ష అందు బాటులోకి వచ్చిందని వైద్యులు తెలిపారు. గురువారం ఓ హోటల్‌లో బర్త్‌ప్లేస్‌ ఆస్పత్రి వైద్యుడు రాజేశ్‌ ఖన్నా, లోటస్‌ ఉమెన్‌, చిల్డ్రన్‌ ఆస్పత్రి నవజాత శిశు వైద్యుడు రాహుల్‌ కడం, లైఫ్‌ సెల్‌ ఎండీ మయూర్‌అభ్య విలేకరులతో మాట్లాడుతూ డ్రై బ్లడ్‌ స్పాట్‌ పరీక్షలో.. 3 చుక్కల రక్తంతోనే 50 రోగాలను గుర్తించవచ్చని తెలిపారు. ఈ తరహా పరీక్షలను ప్రభుత్వ సహకారంతో తమిళనాడు, గోవా, కేరళలో నిర్వహిస్తున్నారని చెప్పారు.