ఆయుర్వేదంతో కిడ్నీ రోగాలకు చెక్‌!

వాషింగ్టన్‌, మార్చి 17:ఆయుర్వేద చికిత్సతో కిడ్నీ రోగులకు ప్రయోజనం ఉంటుందని భారత శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. భారత ఆయుర్వేద ఔషధం ‘పునర్నవ’ సిర్‌పను వాడడం వలన కిడ్నీ సమస్యలు తగ్గుముఖం పడతాయని బనారస్‌ హిందు యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్ధరించారు. పునర్నవ మొక్క సారం నుంచి తయారు చేసిన ఈ ఔషధంతో కిడ్నీ వ్యాధిని నివారించవచ్చని వారు పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా కిడ్నీ సమస్యలున్న మహిళకు ఒక నెలపాటు పునర్నవ సిర్‌పను అందించగా, ఆమె రక్తంలో క్రియేటినైన్‌, యూరియా స్థాయులు తగ్గాయని గుర్తించారు.