తక్కువ ఖర్చుతో కేన్సర్‌కు చికిత్స: మోదీ

05-02-2019: ప్రాణాంతక కేన్సర్‌ నివారణకు అతి తక్కువ ఖర్చుతో చికిత్స విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచ కేన్సర్‌ దినం సందర్భంగా ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. ‘‘కేన్సర్‌ను ముందుగానే గుర్తించి, నివారించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. ఆయుష్మాన్‌ భారత్‌ వంటి పథకాల ద్వారా తక్కువ ఖర్చులోనే నాణ్యమైన చికిత్స అందిస్తున్నాం’’ అని వివరించారు. ‘‘కేన్సర్‌పై పోరాడుతూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతున్నారు’’ అంటూ కేన్సర్‌ వ్యాధిగ్రస్తులను అభినందించారు. ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి భరోసా ఇచ్చే దిశగా కేన్సర్‌ పరిశోధనలు కొనసాగాలన్నారు.