పోలియో చుక్కలు వికటించి 9 నెలల శిశువు మృతి

లక్నో, 14-03-2019: పల్స్ పోలియో కార్యక్రమంలో మొట్టమొదటి సారి అపశ్రుతి చోటుచేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. యూపీలోని బండ పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 9 నెలల శిశువుకు పోలియో చుక్కలు వేశారు. అంతే పోలియో చుక్కలు వికటించి శిశువు మరణించింది. ఈ ఘటనపై స్పందించిన బండ జిల్లా కలెక్టరు లాల్ హుటాహుటిన సంఘటన స్థలాన్ని సందర్శించారు. పోలియో చుక్కల వల్ల శిశువు మరణించిన ఘటన దురదృష్టకరమని, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతాధికారులతో కమిటీని నియమించి, దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టరు చెప్పారు.