44కు చేరిన స్వైన్‌ ఫ్లూ మరణాలు

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో స్వైన్‌ ప్లూ బారిన పడి ఈ ఏడాది 44 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 1800 మందికి వ్యాధి సోకగా, తాజాగా పోలీసు అధికారి మృతి చెందారు. వాతావరణంలో ఈ వ్యాధి కారకమైన హెచ్‌1ఎన్‌1 వైరస్‌ ఎక్కువగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, బయటకు వెళ్లినప్పుడు మాస్కులను ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆగస్టు నుంచి వ్యాధి తీవ్రత పెరిగిందని, మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉందనిఅంచనా వేస్తున్నారు.