కిడ్నీ రోగులకు 2500 పింఛన్‌

అమరావతి, 13-07-2018: కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులకు నెలకు రూ.2500 పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ వైద్య విధాన్‌ పరిషత్‌ కమిషనర్‌ ప్రతిపాదన మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.