కంటి నిండా నిద్ర కోసం...

10-09-2018: రాత్రి వేళల్లో అతిగా తినకూడదంటారు. కానీ పొట్ట ఖాళీగా ఉంటే నిద్రకు అంతరాయం కలుగుతుంది. అందుకే పోషకాలు నిండి ఉన్న హెల్తీ స్నాక్స్‌ తీసుకోవడం వల్ల పొట్ట తేలికగా ఉండటంతో పాటు కంటినిండా నిద్ర పడుతుంది. ఇంతకీ ఆ స్నాక్స్‌ ఏమిటంటే...
 
పాప్‌కార్న్‌: తేలికగా, రుచిగా ఉండే పాప్‌కార్న్‌ బెస్ట్‌ స్నాక్‌. ఇవి తింటే పొట్ట తేలికగా ఉంటుంది. వీటిలో పీచు పదార్థం అధికంగా ఉండడం వల్ల తొందరగా ఆకలి వేయదు. రాత్రిళ్లు హాయిగా నిద్రపడుతుంది.
 
యోగర్ట్‌: రాత్రి పూట తేలికైన, క్యాలరీలు ఉన్న ఆహారం తినాలనుకునే వారు యోగర్ట్‌ తీసుకుంటే బెటర్‌. నట్స్‌, సెరల్స్‌, చిరుధాన్యాలతో కలిపి తీసుకోవచ్చు. యోగర్ట్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇది నిద్ర తొందరగా పట్టేలా చేస్తుంది.
 
పిస్తాపప్పు: ఇవి ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. వీటిలో కార్భోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎక్కవగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.
 
అరటి పండ్లు: బనానా షేక్‌ లేదా అరటి పండ్లను చిన్న ముక్కలుగా కోసుకుని తినవచ్చు. శరీరానికి బలాన్ని ఇవ్వడమేగాక నిద్ర పట్టేలా చేస్తాయి.