చలిని తరిమేయండిలా..

19-12-2018: చలికి ఉదయాన్నే వ్యాయామం చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొంచెం కొత్తగా ప్రయత్నిస్తే చలిలోనూ ఎంచక్కా ఎక్సర్‌సైజ్‌లు చేయొచ్చు. అవే ఇవి...

బృందంలో చేరండి: యోగ గ్రూప్‌ క్లాసెస్‌ లేదా గ్రూప్‌ వర్కవుట్‌ సెషన్స్‌లో పాల్గొని, క్యాలరీలను కరిగించేయండి. బృందంగా వ్యాయామాలు చేయడం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవడేందుకు ఈ వర్కవుట్స్‌ దోహదపడతాయి.

ఫిట్‌నెస్‌ యాప్స్‌: ఇంటి వద్ద వ్యాయామం చేయడానికి బద్థకంగా ఉంటే, కొత్త ఆలోచనలు చేయండి. ఆన్‌లైన్‌లోని ట్యుటోరియల్స్‌, పాడ్‌కాస్ట్స్‌, సబ్‌స్క్రయిబ్‌ చేసుకోడానికి వీలుండే స్మార్ట్‌ ఫోన్‌ యాప్స్‌ను ఉపయోగించుకోండి. వీటి సాయంతో ఉత్సాహంగా ఇంటివద్దే వర్కవుట్స్‌ చేయవచ్చు.
వార్మ్‌ కిట్‌: చేతులకు గ్లోవ్స్‌, తలకు బ్యాండ్స్‌ ధరించండి. ఇవి మీకు వెచ్చదనాన్ని అందిస్తాయి. ఇవి ధరిస్తే చలిలోనూ మీరు వర్కవుట్స్‌ను చేసుకోవచ్చు.
మిక్స్‌డ్‌ ఎక్సర్‌సైజ్‌లు: మీ శరీరం తీరుకు అనువైన వ్యాయామాలను ఎంచుకోండి. ప్రతి ఎక్సర్‌సైజ్‌ను ఆస్వాదిస్తూ చేయండి. అప్పుడే మనసు, శరీరం ఉత్సాహంగా ఉంటాయి.