తేనెను తరచూ వాడితేనే...!

13-08-2019: తేనెలో ఎన్నో ఔషధగుణాలున్నాయి. దీనిలోని సహజమైన చక్కెర, నీరు, మినరల్స్‌, ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌ల మిశ్రమం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని వివిధ రూపాల్లో రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ న్యూట్రీషన్‌ డాక్టర్‌ ప్రియాంక రోహగ్తీ. తేనె వల్ల ఆరోగ్యానికి, సౌందర్యానికి కలిగే మేలు ఏమిటంటే...

తేనెలో యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ సీజన్‌లో వచ్చే దగ్గు, ఇతర అలర్జీలపై పోరాడుతాయి. వాటి నుంచి ఉపశమాన్ని ఇస్తాయి.

ఒక టేబుల్‌ స్పూను తేనెలో 17 గ్రాముల కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. ఇది తక్షణ శక్తినిస్తుంది. సహజ సిద్ధమైన తేనెలోని షుగర్‌, ఫ్రక్టోస్‌, గ్లూకోజ్‌ నేరుగా రక్తంలోకి వెళ్లి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
ఈ సీజన్‌లో విపరీతమైన దగ్గుతో బాధపడేవారు కొంచెం తేనె తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
సుఖనిద్రకు బాగా పనికొస్తుంది. ఇన్సులిన్‌, సెరటోనిన్‌ను విడుదల చేయడంతో శరీరానికి స్వాంతన లభించి, త్వరగా నిద్రపడుతుంది.
తేనెలో యాంటీ బాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఫంగ్‌సను పెరగకుండా చేసి, చుండ్రును పోగొడుతుంది.