ముళ్లున్నా...మేళ్లెన్నో!

ఆంద్రజ్యోతి, 08-09-2017: నాగజెముడు పుష్పాలను, గళ్ల ఉప్పు, సున్నంతో కలిపి మెత్తగా నూరి, సెగగడ్డలపై రోజుకు రెండు సార్లు లేపనం చేస్తే గడ్డలు కరిగిపోతాయి.
  • నాగజెముడు పండ్ల నుంచి తీసిన రసాన్ని రోజుకు రెండు చెంచాలు సేవిస్తే గొంతు నొప్పి తగ్గిపోతుంది.
  • రోజుకు ఒక పండు చొప్పున వారం రోజులు తింటే ఆకలి పెరుగుతుంది.
  • నాగజెముడు ఆకులను నూరి ముద్దగా చేసి కడితే వ్రణాలు పగిలిపోతాయి. చాలా రోజులుగా మానకుండా వేధిస్తున్న కురుపులు కూడా హరించుకుపోతాయి.
  • నాగజెముడు పండ్ల రసానికి చక్కెర కలిపి పానకం చేసి రోజుకు రెండు స్పూనులు సేవిస్తే, ఉబ్బసం, కోరింత దగ్గు తగ్గిపోతాయి.
  • నాగ జెముడు లేత మట్టలపై ఉండే ముండ్లను తొలగించి, మర్రి ఆకుల మధ్య ఉంచి ఏదైనా పుల్లతో కుట్టి కుమ్ములో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత మెత్తగా నూరి, దానిలో తగినంత పటిక బెల్లం చూర్ణం కలిపి రోజుకు రెండు పూటలా రెండు వారాలు సేవిస్తే అర్శమొలు తగ్గిపోతాయి.
  • నాగజెముడు పండ్లను కొద్ది రోజుల పాటు వరుసగా తింటే శరీరానికి చలువ చేయడంతో పాటు మూత్రపు మంట కూడా తగ్గుతుంది.
  • బాగా పెరిగిన నాగజెముడు పూలను, నీడన ఎండించి, బట్టతో వడబోసిన చూర్ణాన్ని, అర స్పూను చూర్ణం చొప్పున రోజుకు రెండు పూటలా మూడు నెలల పాటు వాడితే ప్రోస్టేట్‌ గ్రంధి వాపు తగ్గిపోతుంది.