రావి బెరడు, పండ్లతో ఎన్నెన్నో లాభాలు

03-09-2017:  రావి చెట్టు బెరడు కషాయాన్ని పుక్కిలిస్తే, నోటి పుండ్లు తగ్గుతాయి.
ఎండించిన రావి పండ్ల చూర్ణాన్ని పూటకు తులం చొప్పున, రోజుకుకు రెండు పూటలా సేవిస్తే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది.
రావి పండ్ల చూర్ణానికి సమానంగా, పంచదార కలిపి పాలతో తీసుకుంటే స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిపోయి సంతాన యోగ్యత కలుగుతుంది. పురుషుల్లో వీర్యవృద్ధి పెరుగుతుంది.
కాల్చిన రావి చెక్క బూడిదను నీటితో కలిపి సేవిస్తే అజీర్తి, కడుపు నొప్పులు, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
రాగి బెరడు కషాయంతో కడిగితే కురుపులు, పండ్లు తగ్గుతాయి.
పాలతో తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుంది. శీఘ్రస్ఖలనం సమస్య కూడా ఉండదు.