పాప్‌కార్న్‌తో ప్రయోజనాలెన్నో...

24-08-2018: పాప్‌కార్న్‌ని చిన్నాపెద్దా అందరూ ఇష్టపడతారు. ఇది టైమ్‌పాస్‌ స్నాక్‌ అయినప్పటికీ దీనిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి.ఆర్గానిక్‌ పాప్‌కార్న్‌ తింటే మరీ మంచిది. పైగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.. అవేమిటంటే...
జీర్ణక్రియలో సహాయపడతాయి. బరువుతగ్గడంలో ఉపయోగపడతాయి.
బ్లడ్‌ షుగర్‌, ఇన్సులిన్‌ పరిమాణాలను క్రమబద్ధీకరిస్తుంది.
ఎనర్జీ పెరుగుతుంది. డయటరీ ఫైబర్‌ కూడా ఇందులో ఉంది.
ఫ్యాట్‌ తక్కువ. విటమిన్‌ బి కాంప్లెక్స్‌, మాంగనీసు, మెగ్నీషియం, ఐరన్‌లు బాగా ఉన్నాయి.
ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది.
ఇది పూర్తిగా హెల్దీ స్నాక్‌. గ్లూటెన్‌-ఫ్రీ. మనం తీసుకునే డైట్‌కు హానిచేయదు.
ఇవి తింటే ఆకలి తొందరగా వేయదు.
ఇన్ఫమ్లేషన్‌ తగ్గిస్తుంది.
మలబద్దకం నుంచి సాంత్వననిస్తుంది.
పాలకూరలో కన్నా పాప్‌కార్న్‌లో ఐరన్‌ ఎక్కువ.
గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
పీచుపదార్థాలు అధికంగా ఉండడం వల్ల పెద్దపేగు కాన్సర్‌ని నిరోధిస్తుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
బి3, బి6, ఫోల్లేట్‌, పాంథోథెనిక్‌ యాసిడ్లు ఇందులో ఉన్నాయి. ఇవి ఎనర్జీనివ్వడంతో పాటు వివిధరకాల పోషకాలను శరీరంలో క్రమబద్ధీకరిస్తాయి.