ప్లాంక్స్‌తో లాభాలెన్నో..!

28-08-2018: వ్యాయామాల్లో ‘ప్లాంక్స్‌’కు ప్రత్యేకత ఉంది. పుష్‌పలను పోలిన ‘ప్లాంక్స్‌’ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రోజూ కొద్దిసేపు ప్లాంక్స్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
 
ప్లాంక్స్‌ చేసేప్పుడు శరీరాన్ని మోకాళ్లు, పాదాల మీద బ్యాలెన్స్‌ చేయాలి. ఒక్క సైడ్‌ మీద చేసే ప్లాంక్స్‌ చాలా మేలు చేస్తాయి. ఇవి చేసేటప్పుడు నిటారుగా ఉండాలి. రోజూ చేయడం వల్ల నడుం బలంగా అవుతుంది. నిటారుగా నిలబడడం అలవాటవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదు.
శరీరంలోని కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. ప్లాంక్స్‌ చేయడం వల్ల బరువులు సులువుగా ఎత్తగలరు. బొటాక్స్‌ గట్టిపడతాయి.
వెన్నెముక మీద, తొడ కండరాల మీద ఒత్తిడి తగ్గుతుంది.
ప్లాంక్స్‌ చేస్తే జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. ఎక్కువ క్యాలరీలు కరిగించొచ్చు కూడా.