కమలాపండు ఉపయోగాలు తెలిస్తే అసలు వదలరు

సీ విటమిన్‌తో పాటు మరిన్ని విటమిన్లు ఉన్నాయంటున్న వైద్యులు

హైదరాబాద్, 26-12-2018: మార్కెట్‌లో కమలా పండ్లు విరివిగా లభ్యమగుతున్నాయి. సీజన్‌ పండ్లు కావడంతో వ్యాపారులు వీటినిరాసులుగా పోసి విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారులు తోపుడుబండ్లపై పేర్చుకుని ప్రధాన రోడ్లపక్కన, చౌరస్తాల వద్ద వీటిని విక్రయిస్తున్నారు. ధరకు తక్కువతో పాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషక పదార్థాలు నారింజలో ఎక్కువగా లభ్యమవుతుండడంతో నగరవాసులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. అందరూ ఇష్టపడే నారింజలో శరీరానికి కావాల్సిన ఎన్నో విటమిన్లు ఉన్నాయని వైద్యులు సెలవిస్తున్నారు.

కమలా పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు
కమలాపండ్లలో శరీరానికి అవసరమమ్యే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్‌ సీతో నిండి ఉండే ఎంజైములు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి కొవ్వును కరిగించి మనిషి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపకరిస్తాయని వారు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లను రోజూ తింటే మంచిదని వారు తెలియజేస్తున్నారు. ఈ పండ్లలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియ బాగా జరిగేందుకు సాయపడుతుంది. అర్థరైటీస్‌ కీళ్ల నొప్పులతో బాధపడేవారు కమలారసం తాగి తే మంచి మందులా పని చేస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులోని లైకోపీన్‌ పోషకం కాన్సర్‌ కారకాలతో పోరాడుతుందని వారు వివరిస్తున్నారు. డీఎన్‌ఏలోను కణాలు నాశనం కాకుండా కమలాకాపాడుతుందని వైద్యనిపుణులు అంటున్నారు.
 
కమలా పండ్ల నుంచి మన ఆరోగ్యానికి అవసరమైన ఇనుము, క్యాల్షియం, పొటాషియం మాంగనీస్‌, మెగ్నీషియం. ఫోలిక్‌ యాసిడ్‌, బి. విటమిన్లు పొందవచ్చునని ఇలా ఎన్నో పోషవిలువతో నిండి ఉన్న కమలాపండ్లను ఎంత ఎక్కువ తింటే అంత మంచిది వైద్యులు సూచిస్తున్నారు.