ఆరోగ్యానికి తల్లి

దాదాపు అన్ని వంటకాల్లోనూ వాడే వెల్లుల్లి, చాలా మంది దృష్టిలో ఒక వంట దినుసు మాత్రమే. కానీ, వెల్లుల్లిలో పలురకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. కలుషితమైన గాలి, కలుషితమైన నీటివల్ల కలిగే దుష్ప్రభావాలను కూడా తొలగించే శక్తి వెల్లుల్లికి  ఉంది.

నరాల బలహీనత వల్ల కాళ్లు, చేతులు శక్తిహీనమై వచ్చే వణుకుడు రోగం, రుమటాయిడ్‌ ఆర్థరైటి్‌సకు దారి తీసే ఆమవాతం, వెల్లుల్లి నిత్యం తీసుకోవడం వల్ల తగ్గిపోతాయి. 

మూత్రాశయంలోని రాళ్లను కరిగించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది.

వెల్లుల్లి పాయలను మేకపాలలో ఉడికించి, ఆ తర్వాత నేతితో దోరగా వేయించి... తేనెతో కలిపి లేహ్యం చేసి, పుచ్చుకుంటే అద్భుతమైన ధాతుపుష్టి కలుగుతుంది.

రోజూ పరగడుపున రెండు వెల్లుల్లి పాయలు తిన్నా, లేదా భోజనం చేస్తున్నప్పుడు తొలి ముద్దతో పాటు తిన్నా.. రక్తం చిక్కబడకుండా ఉండి, గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

వెల్లుల్లిపాయలను నూరి కట్టు కడితే.. గోరుచుట్టు సమస్య, మడమశూల, వాతం, నరాల నొప్పులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి.

ఉల్లిపాయలను పొట్టు తీసి ఒక పలుచని బట్టలో నాలుగైదు చోట్ల ముడులుగా కట్టి ఒక దండలా తయారు చేసి మెడలో వేస్తే, పసిపిల్లల్లో ఉబ్బసం దగ్గు, నయమవుతాయి. వెల్లుల్లి రసాన్ని వేడి నీళ్లల్లో వేసి తాగించినా ఉబ్బసం , దగ్గు తగ్గుతాయి. 

వెల్లుల్లిపాయలను నూరి, పొత్తికడుపుపై పూస్తే మూత్రకోశం బలపడుతుంది. మూత్రవిసర్జన సంబంధిత ఇబ్బందులు తొలగిపోతాయి.