గోరింట వైద్యం!

గోరింటాకులను మెత్తగా నూరి, రాత్రివేళ అరికాళ్లకు పట్టిస్తే,  పాదాల మంటలు తగ్గుతాయి.
గోరింటాకు కషాయంలో కొంచెం కాచు, కొంచెం మాచికాయ చూర్ణం కలిపి పుక్కిలిస్తే నోటి అల్సర్లు  పోతాయి.
గోరింటాకు రసానికి సమానంగా, నువ్వుల నూనె కలిపి తైలం మాత్రమే  మిగిలేలా సన్నటి మంటపై కాచి,  ఆ తైలాన్ని త లకు మర్దన చేస్తే, తలవెంట్రుకల కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది.
ఆకులను నూరి ముద్దగా చేసి, బెణుకులపై కడితే వెంటనే ఉపశమనం 
లభిస్తుంది.
ఆకుల రసాన్ని గానీ, నూరిన ముద్దను గానీ నూనెలో కలిపి నుదుటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
గోరింటాకును పసుపుతో చేర్చి ముద్దగా నూరి లేపనంగా వేస్తే చీము పట్టిన పుండ్లు సైతం మానిపోతాయి. 
గోరింటాకు తోడుగా, నల్ల కరక్కాయలు,  వేపాకులు, మామిడిపట్ట, దానిమ్మ మొగ్గలను సమభాగాలుగా తీసుకుని ముద్దగా చేసుకోవాలి. దాంట్లో కొన్ని చుక్కల నీళ్లు కలిపి పేస్ట్టులా తయారు చేసుకుని, ముఖం మీద లేపనంగా వేస్తే ముఖం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.