ఆరోగ్యానికి ఇవీ అవసరమే!

28-09-2018: పళ్లు, కూరగాయలే కాదు... తృణధాన్యాలు, మాంసకృత్తులు, వెన్నతీసిన పాల ఉత్పత్తులు కూడా చక్కని ఆరోగ్యానికి అవసరమే.
 
తృణధాన్యాలు: తృణధాన్యాల ద్వారా శరీరానికి తగినంత పీచుపదార్థం లభిస్తుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌ ఫుడ్స్‌ కూడా కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు. క్వినోవా, బార్లీ, గోధుమపాస్తా, గోధుమ బ్రెడ్‌లాంటివి తీసుకోవాలి. రైస్‌ లేదా పాస్తా అరక ప్పు, ఒక రొట్టె, కప్పు ఎండు గింజలు తీసుకోవాలి.
 
మాంసకృత్తులు: మనిషికి రోజుకు 150 గ్రా. మాంసకృత్తులు తీసుకోవాలి. బోన్‌లెస్‌, స్కిన్‌ లెస్‌ చికెన్‌, చిక్కుడు, చేప, గుడ్లు లాంటివాటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఒక గుడ్డు, చిక్కుడు గింజలు పావుకప్పు, 30 గ్రా. మాసం తీసుకోవాలి.
 
వెన్న తీసిన పాల ఉత్పత్తులు: పాల ఉత్పత్తుల్లో పొటాషియం, విటమిన్‌ డి, మాంసకృత్తులు, కాల్షియం లాంటి పలు పోషకాలుండటం వల్ల ఆరోగ్యానికి మంచిది. పెరుగు, వెన్నతీసిన పాలను రోజులో రెండు మూడుసార్లు తీసుకోవాలి. ఐస్‌క్రీములు, వెన్నతీయని పాలను అరుదుగా తీసుకోవాలి.