చింత ఎంతో మేలు!

07-05-2019: చింతపండు, ఆకు రెండూ ఆరోగ్యకరమే! వీటిలోని పోషకాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హెపటైటిస్‌ ఎ, బి, సిల నుంచి రక్షణ కల్పించడంతోపాటు, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్‌లకు గురి కాకుండా కాలేయాన్ని కాపాడతాయి.

కాలేయం దాదాపు 500 జీవక్రియలను నిర్వహిస్తుంది. తనను తాను పునర్నిర్మించుకునే సామర్ధ్యం కలిగిన ఏకైక అవయవం కాలేయం! అయితే అస్తవ్యస్త జీవనశైలి, ఆహారపుటలవాట్లు, వివిధ చికిత్సల్లో భాగంగా వాడే మందుల ప్రభావంతో కాలేయంలో క్రమంగా విషాలు పేరుకుంటూ ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు విసర్జించేలా చేయాలంటే, ఓ చిట్కా పాటించాలి. గుప్పెడు లేత చింత ఆకులను శుభ్రంగా కడిగి, ఒక లీటరు నీళ్లలో కలిపి 15 నిమిషాలపాటు మరిగించాలి. దీన్లో రుచికి తేనె లేదా చక్కెర కలుపుకోవచ్చు. ఈ కషాయాన్ని ఉదయం, సాయంత్రం చెరొక కప్పు తాగితే కాలేయం ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది.