వేస‌విలో బ‌రువు త‌గ్గేందుకు స్విమ్మింగ్ సూత్రం

15-04-2018: వేస‌వికాలంలో సేద‌తీరేందుకు చాలామంది స్విమ్మింగ్‌ను ఆశ్ర‌యిస్తుంటారు. ప‌నిలోప‌నిగా బ‌రువు త‌గ్గేందుకు కూడా స్విమ్మింగ్ చేయ‌డం ఉత్త‌మం. ఇంతేకాదు స్విమ్మింగ్‌తో ప‌లు ప్ర‌యోజ‌నాలున్నాయి. స్విమ్మింగ్ హార్ట్‌రేట్‌ని సరిగా ఉంచి, కండరాల టోన్స్‌ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన బరువును పొందడానికి సహాయపడుతుంది, అలాగే మొత్తం శరీరానికి వ్యాయామాన్ని అందిస్తుంది. స్విమ్మింగ్ వ్యాయామాలు చాలా సులువుగా ఉంటాయి. బరువు తగ్గాల‌నుకునేవారికి స్విమ్మింగ్ ఉత్త‌మ వ్యాయామం. ఒక గంటపాటు స్విమ్మింగ్ చేస్తే దాదాపు 715 క్యాలరీలు ఖర్చవుతాయని ఒక అధ్యయనంలో వెల్ల‌డైంది. ఇండియన్ యూనివర్సిటీ పరిశోధనల ప్రకారం స్విమ్మింగ్ చేసేవారి నడుము, తొడలు త‌గిన స్థాయిలో ఉన్న‌ట్లు తేలింది. అలాగే స్విమ్మింగ్‌లో ఒక అరగంటపాటు గడిపితే, రోజంతా చురుకుగా ఉండేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.