ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్‌కార్న్‌..

 

గణేశ్‌నగర్‌(కరీంనగర్), ఆగస్టు 17: సన్నని చినుకులు పడుతూ ఉంటే ఎర్రటి నిప్పులపై కాల్చిన మొక్కజొన్న పోత్తు తింటే ఆ మాజనే వేరు. కమ్మని రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మొక్కజొన్న పోత్తులో దాగిఉన్నాయి. ఇందులో శక్తివంతమైన పోషకాలు ఖనిజాలతో పాటు ఎ, బి, సి, ఇ విటమిన్స్‌ లభిస్తున్నాయి. జూన్‌నుంచి డిసెంబర్‌ జనవరి వరకు సీజన్‌ కొనసాగుతుంది. దీంతో చిన్న చిన్న వ్యాపారులకు ఉపాధి దొరికేది ఈ సీజన్‌లోనే కావడంతో ప్రధాన రహదారుల వెంబడి ఎక్కడ చూసిన స్వీట్‌కార్న్‌ ఉడకబెట్టి కారం చల్లి రుచికరంగా ఉండే విధంగా అందిస్తున్నారు. దీంతో ప్రయాణికులు దారిలోనే కొనుగోలు చేస్తున్నారు. ఒక్క మక్క జొన్న పొత్తు రూ. 6 నుంచి రూ. 8 వరకు అమ్ముతున్నాయి. రూ. 20లకు 3 నుంచి 4 సైతం అందజేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులకు శక్తిని ఇచ్చే పోషక పదార్థాలు లభిస్తున్నాయి. అమ్మకం దారులకు రోజు వారి  కూలి కన్న కాస్తా ఎక్కువగానే సంపాదించుకుంటున్నారు. మన జిల్లాలో స్వీట్‌కార్న్‌ పంటలు ఎక్కువగా లేకపోవడంతో మెదక్‌ గ జ్వెల్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు ముదిరాజ్‌ సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు కొలకాని నర్సయ్య, అధ్యక్షుడు పిట్టల లింగయ్యలు తెలుపుతున్నారు. ఒక్కొసంచి రూ. 500 ల నుంచి 750 వరకు ఉంటుంది.  పంటలు ఇక్కడ లేకపోయిన అమ్మకాలు మాత్రమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బాగా జరుగుతున్నాయి. 

స్వీట్‌కార్న్‌ ప్రయోజనాలు
స్వీట్‌కార్న్‌తో శక్తివంతమైన పోషకాలు, ఖనిజాలతో పాటు ఎ, బి, సి, ఇ విటమిన్‌ లభిస్తాయి. మొక్కజొన్నలో ఫోటోదైనిక్‌ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మనం తిన్న ఆహర సక్రమంగా జీర్ణం అయ్యేందుకు ఎంతగానో దోహద పడుతుంది. మొక్కజొన్నలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం మొలలు సమస్యలతోపాటు పెగు క్యాన్సర్స్‌ను కూడా  అరికడుతుంది. రక్తహీనతతో సమస్యతో బాధపడే వారి పాలిట మొక్కజొన్న ఒక అద్భుత వరంమని చెప్పవచ్చు. ఇందులో ఉండే విటమిన్‌ బి 12, ఐరన్‌, పోలిక్‌ యాసిడ్‌ రక్తహీనత సమస్యను దూరంచేస్తుంది. రక్తంలో ఎర్ర రక్త కణాల వృద్దికి ఎంతగానో దోహద పడుతుంది. రక్తంలోని కోలస్ట్రాలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. రక్తనాళాల్లో ఏర్పడే అడ్డంకులను తొలగించి రక్త సరఫరా వ్యవస్థను మెరుగు పరుస్తుంది. తద్వారా గుండెపోటు పక్షపాతం బిపి వంటి సమస్యలను తగ్గిస్తుంది. స్వీట్‌కార్న్‌ శరీరపు ఎనర్జి లెవెల్స్‌ను పెంచుతుంది. ఇందులో లభించే ఖనిజాలు శాతం ఎక్కువే ఇందులో ఉండే ఫాస్పరస్‌ మూతపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. మెగ్నిషియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే మెదడు నాడి వ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది. మొక్కజొన్నలో ఉండే పైటోకెమికల్స్‌ శరీరంలో ఇన్సూలిన్‌ శాతాన్ని నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పెరుకపోకుండా చేస్తుంది. అందువల్ల చక్కెర వ్యాధితో బాదపడే వారు తమాడైట్‌తో మొక్కజొన్నతో చేసిన పదార్తాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.