సూపర్‌ పనీర్‌!

20-09-2019: కాటేజ్‌ ఛీజ్‌.. పనీర్‌తో చేసిన గ్రేవీ, సూప్‌, కర్రీ ఏదైనా ఇష్టంగా లాగించేస్తాం. ప్రొటీన్లతో నిండిన పనీర్‌ను రుచి కోసమే కాదు ఆరోగ్యం పెంచుకోవడానికి కూడా తినాల్సిందే. ఈ సూపర్‌ఫుడ్‌ తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేమంటే...
 
బీ కాంప్లెక్స్‌ విటిమిన్లు పుష్కలంగా ఉండే పనీర్‌ మంచి పోషక వనరు. పనీర్‌ తింటే తొందరగా శక్తి వస్తుంది. జీవక్రియలు మెరుగ్గా జరుగుతాయి.
దీనిలోని కాల్షియం, మెగ్నీషియం దంతాలు, ఎముకలను దృఢంగా మారుస్తాయి.
రక్తంలో గ్లూకోజ్‌ విడుదలను ఆలస్యం చేసి, చక్కెర నిల్వలు పెరగకుండా చూస్తుంది.
దీనిలోని మెగ్నీషియం శరీరంలోని లవణాలను బ్యాలెన్స్‌ చేస్తుంది. రక్తంలో సోడియం నిల్వల్ని తగ్గించి, రక్తపోటును నివారిస్తుంది.
పనీర్‌లో పీచుపదార్థం ఎక్కువ. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నుంచి బయటపడేస్తుంది.
గర్భిణులకు అవసరమైన ప్రోటీన్లు పనీర్‌లో లభిస్తాయి. దీనిలోని ఫోలిక్‌ ఆమ్లం ఎర్రరక్త కణాల ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతుంది.
ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండడం వల్ల మధుమేహంతో బాధపడేవారికి పనీర్‌ మంచి ఫుడ్‌ ఆప్షన్‌.
ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పనీర్‌ తింటే తొందరగా ఆకలి వేయదు. దీనిలోని లినోలెనిక్‌ ఆమ్లం కొవ్వును కరిగించేస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.